కిర్రాక్ ఫోన్ లాంచ్ - AI ఫీచర్లు అదిరిపోయాయ్..!
శామ్సంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A17 4Gని జర్మనీలో విడుదల చేసింది.
శామ్సంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A17 4Gని జర్మనీలో విడుదల చేసింది.
4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ. 15,000 కు లిస్ట్ అయింది.
ఇది 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ జెమిని లైవ్, సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక AI ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది.
అలాగే MediaTek Helio G99 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను.. ఆరు సంవత్సరాల ప్రధాన OS అప్డేట్‌లు, ఆరు సంవత్సరాల సేఫ్టీ అప్డేట్‌లను పొందుతుంది.
ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ (OIS మద్దతుతో), 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి.
ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13MP కెమెరా అందించారు.
ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.
ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.