ఆత్మలు, దెయ్యాలను చూసి కుక్కలు ఏడవడం, మొరుగడం చేస్తాయని చెబుతారు. 

అంతే కాదు కుక్కలు మొరగడం వల్ల చెడు శకునము కూడా ఉందని అంటుంటారు. 

కానీ సైన్స్ మాత్రం ఇవన్నీ అపోహలు మాత్రమే అని చెబుతోంది. 

రాత్రి పూట కుక్కలు ఏడవడానికి, మొరగడానికి వేరే కారణాలు  ఉన్నాయని  చెబుతున్నారు.

కొత్త ప్రాంతానికి వచ్చినప్పుడు లేదా దారితప్పినప్పుడు బాధతో కుక్కలు అరుస్తాయట. 

మనుషులను ఆకర్షించేందుకు కుక్కలు ఏడుస్తూ అరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

గాయపడిన లేదా వాటికి బాగోలేకపోయిన కుక్కలు అరుస్తుంటాయట. 

అలాగే రాత్రి పూట వాటి మంద నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్నపుడు కూడా కుక్కలు ఏడవడం చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.