చాలా మంది చల్లటి బీర్ తాగడానికి ఇష్టపడతారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది.

ఇటీవలి పరిశోధనలో చల్లబడిన బీర్ ఎందుకు రుచిగా ఉంటుందో వివరించారు నిపుణులు.

పరిశోధకులు నీటి ప్రవర్తనను, ఆల్కహాలిక్ పానీయాలలో ఉండే ఇథనాల్ అణువులను అధ్యయనం చేశారు.

నీటి ఉష్ణోగ్రతను బట్టి ఇథనాల్ అణువుల రుచి మారుతున్నట్లు పరిశోధనల్లో గమనించబడింది.

బీర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచినప్పుడు, వాటిలోని  ఇథనాల్ అణువులు పిరమిడ్ ఆకారాన్ని పొందుతాయి.

ఈ సమయంలో ఇథనాల్ అణువులు ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి.

ఇది చల్లటి బీర్ రుచిని పెంచుతుంది అని నిపుణులు చెప్పారు.