వాస్తు ప్రకారం ఇంట్లో, దుకాణంలో లాఫింగ్ బుద్ధ ఉంచడం శ్రేయస్సు, ఆనందాన్ని కలుగుతుందని నమ్ముతారు.
అలాగే లాఫింగ్ బుద్ధను బహుమతిగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు.
చైనాలో లాఫింగ్ బుద్ధుడిని దేవుడిగా పూజిస్తారు.
బుద్ధు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూలత తొలగిపోయి సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు.
లాఫింగ్ బుద్ధుడు ఎక్కడ ఉంటాడో అక్కడ డబ్బు, ఆనందం ఉంటుందని విశ్వాసం.
అందుకే ప్రజలు బుద్ధుని విగ్రహాన్ని ఇళ్లలో, హోటళ్లలో, దుకాణాలు, కార్యాలయాలలో ఉంచుతారు.
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం ముందు బుద్ధుడి విగ్రహాన్ని ఉంచరాదు.
తలుపు నుంచి దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో విగ్రహాన్ని అమర్చాలని చెబుతారు.