వర్షాకాలంలో రోజూ తలంటు స్నానం చేయాలి. లేదంటే తేమ వల్ల మీ జుట్టు జిడ్డుబారిపోతుంది.

తలస్నానం చేసేటప్పుడు యాంటీ-బాక్టీరియల్ షాంపూలు, క్లీనర్లు వాడాలి.

తడిగా ఉన్న జుట్టును ముడివేస్తే జుట్టు పాడవడమే కాకుండా,దుర్వాసన వస్తుంది.

వారానికి మూడు సార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

జుట్టుకి జెల్‌, వ్యాక్స్‌ వంటివి వాడకపోవడమే మంచిది. అవి మాడుపై మరింత జిడ్డుని పెంచుతాయి.

వారానికి రెండు సార్లయినా వేడి నూనెతో మసాజ్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

జుట్టు కుదుళ్లలో చుండ్రు రాకుండా చూసుకోవాలి.

మంచి వాసన ఉందని, రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు వాడొద్దు.

వర్షాకాలంలో జుట్టు వదులుగా ఉంచుకోండి. గట్టిగా జడ వేయవద్దు.