హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న "వారణాసి" మూవీ ఈవెంట్ జరిగింది.

రాజమౌళి, మహేశ్ బాబు టైటిల్ టీజర్‌ ఈవెంట్‌కు నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు.

ఆమె తన అద్భుతమైన లుక్స్, అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ కార్యక్రమానికి ఆమె అద్భుతమైన లెహంగా ధరించి అప్సరసలా కనిపించింది.

ఆమె అనామిక ఖన్నా డిజైన్ చేసిన తెల్లటి లెహంగాను ధరించి దేవతలా కనిపించింది.

నవంబర్ 16న ఇన్‌స్టాగ్రామ్‌లో తన లుక్ ఫోటోలను షేర్ చేసింది.

దానికి ‘‘చానెలింగ్ మై ఇన్నర్ దేవి. #Mandakini #Varanasi" అని కాప్షన్ ఇచ్చింది.

ఈ లుక్‌పై ఆమె భర్త నిక్ జోనాస్ కూడా 'ఓ మై గాడ్' అంటూ ప్రశంసించారు.

ఈ లుక్‌కు రాజసౌందర్యం తీసుకొచ్చేలా ఆమె టెంపుల్ జ్యువెలరీని ఎంచుకుంది.

'మందాకిని' పాత్రలో ప్రియాంక రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.