రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ తో పనిలేదని చెబుతుంటారు నిపుణులు. 

నిజంగానే యాపిల్ లో  ఫైబర్, విటమిన్స్, మినరల్స్  పుష్కలంగా ఉంటాయి.   

ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

కానీ వీటిని కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు నిపుణులు 

యాపిల్ కొనేటప్పుడు అవి చిన్న పరిమాణంలో, సాధారణ బరువు ఉండేలా చూసుకోవాలి.

పెద్దగా ఉండే యాపిల్స్‌ చెడిపోయే అవకాశం ఉంది. 

అదే విధంగా, బరువుగా ఉండే ఆపిల్స్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు.

ఆపిల్స్ ఫ్రెష్ గా ఉండటానికి, వాటిపై హానికరమైన కెమికల్స్ వాడతారు. 

కావున, కంగారుగా తినకుండా.. నీటుగా కడిగి తినాలి.

లేదంటే డబ్బులిచ్చి మరీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళము అవుతాము