నార్మల్ టెంపరేచర్ దగ్గర పాడైపోయే ఆహారపదార్ధాలను ఎక్కువ సమయం బయట పెట్టకపోవడమే మంచిది.

5 నుంచి 60 డిగ్రీల టెంపరేచర్ మధ్య పదార్ధాల్లోని సూక్ష్మక్రిముల సంఖ్య బాగా పెరుగుతుంది. కాబట్టి అవి పూర్తిగా చల్లారకముందే ఫ్రిజ్ పెట్టాలి

ఇక వేడి పదార్ధాలను డైరెక్ట్ గా ఫ్రిజ్ పెట్టకుండా.. అరగంట తరువాతే పెట్టాలి.

పాథోజెనిక్ బ్యాక్టీరియా పదార్ధాల్లో చేరితే ఎలాంటి చెడు వాసన రాదు.

అయితే ఈ బ్యాక్టీరియాను కనిపెట్టలేం. కాబట్టి ఆహార పదార్ధాల్లోకి ఈ బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే.. ఫ్రిజ్ పెట్టడమే మంచిది

ఎక్కువ నూనెతో చేసిన ఆహార పదార్ధాల్లోకి క్లాస్ట్రిడియం బాట్యులిజం అనే బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి వీటిని ఎక్కువ సేపు బయట పెట్టకుండా ఫ్రిజ్ పెట్టడమే బెటర్.

ఇక డీఫ్రాస్ట్‌ చేసిన పదార్థాలను ఉడికించి పొగలు కక్కటం తగ్గాక తిరిగి రీఫ్రీజ్‌ చేసుకోవచ్చు.

ఇక ఫ్రిజ్ లో పెట్టిన మాంసాన్ని వండేముందు ఉప్పు ఇంకా వెనిగర్ తో శుభ్రంగా కడిగిన తరువాతే వండాలి.