పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ కల్కి 2898 AD' నేడు థియేటర్స్ లో విడుదలైంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ కల్కి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ నాగి కల్కి 2898 AD' ప్రపంచాన్ని సృష్టించేందుకు దాదాపు నాలుగేళ్లుగా శ్రమించాడు.
నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి మొదటి షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. సినిమా బ్లాక్‌బస్టర్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ నాగి కల్కి కోసం తాను పడిన శ్రమను తెలియజేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశారు.
విరిగిన చెప్పుల ఫోటోను షేర్ చేస్తూ ఇది 'సుదీర్ఘ ప్రయాణం' అని రాసుకొచ్చారు. సినిమా కోసం తాను చేసిన కష్టాన్ని ఫోటో ద్వారా తెలిపారు.
భాషతో సంబంధం లేకుండా సౌత్, నార్త్ లో కల్కి పై జనాల్లో విపరీతమైన క్రేజ్.
థియేటర్స్ ముందు ప్రభాస్ భారీ కటౌట్స్ తో ఫ్యాన్స్ రచ్చ
బుక్ మై షోలో కల్కి బుకింగ్స్ గంటకు 5 వేల నుంచి 15 వేల టికెట్ బుకింగ్స్
తెలుగులో 1600కి పైగా.. మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్‌లో 4500
థియేటర్స్ రిలీజ్
దీపికా పదుకొణె, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో
తొలిరోజే కల్కి 90-100 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కల్కి ఒక భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమా. ప్రత్యేకంగా ఈ సినిమా కోసం సరి కొత్త టెక్నాలజీతో 'బుజ్జి' (రోబోటిక్ కార్) ని డిజైన్ చేశారు డైరెక్టర్ నాగి.
బుజ్జి మేకింగ్ టెక్నాలజీ కోసం టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాను సహాయం తీసుకున్నారు.
నాలుగేళ్ల శ్రమతో బుజ్జిని డిజైన్ చేసింది నాగి టీమ్. ప్రభాస్ తో పాటు సినిమాలో బుజ్జి పాత్ర కూడా కీలకం