ప్రభాస్ ‘కల్కి2898 AD’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది.
రెండో రోజు తెలుగులో రూ.25.65 కోట్లు,
హిందీలో రూ.22.5 కోట్లు వసూలు చేసింది.
డే 2 ఇండియాలో మొత్తం రూ.149.3 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ 250 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా ‘పఠాన్’, ‘జవాన్’, ‘జైలర్’, బాహుబలి వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.