Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

8GB+256GB స్టోరేజ్ వేరియంట్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ జనవరి 2025లో రూ.26,999కి లాంచ్ అయింది.

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999 కి లిస్ట్ అయింది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ పై 5% తగ్గింపు (రూ.750 వరకు) పొందవచ్చు.

పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల రూ.18,400 ఆదా చేయవచ్చు.

అయితే ఇంత మొత్తంలో ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి.

ఈ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, OIS, EIS మద్దతుతో 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 20 -మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.