ఖాళీ సమయాన్ని ఇలా వాడేస్తున్న సమంత..!!

 By Bhoomi

టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం బాలి వేకేషన్ లో ఉన్నారు. దీవుల దేశం ఇండోనేషియాలో ఎంజాయ్ చేస్తోంది. 

సమంత తన వెకేషన్ ఫొటోలు ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ... ఖాళీ సమయాన్ని మానసిక ప్రశాంతత కోసం ఉపయోగిస్తున్నారు. 

ఇటీవలే ఖుషి, సిటాడెల ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది. గతేడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించింది.

ఖుషి మూవీ షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యం బారిన పడింది. 

నెలలపాటు ఇంటికే పరిమితమైన సమంత...కోలుకున్న తర్వాత యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 

చికిత్స కోసం సమంత అమెరికా వెళ్తున్నారట. కొన్ని నెలలపాటు అక్కడే ఉంటారట. 

అందుకే ప్రస్తుతం సమంత ఆధ్యాత్మిక క్షేత్రాలతోపాటు నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తున్నారు.