పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’.

ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ట్రైలర్ అప్డేట్ కూడా ఇవాళ మేకర్స్ అందిస్తారని తెలుస్తోంది.

దీనికంటే ముందు ఈ మూవీ రిలీజ్ డేట్‌పై కొన్ని పోస్టర్లు వైరల్‌గా మారాయి.

దాని ప్రకారం.. ఈ మూవీని జూలై 25న రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

వాస్తవంగా ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కానందున ఈ సినిమాను వాయిదా వేశారు.

ఇప్పుడు జూలై 25న రిలీజ్ చేసే అవకాశం ఉందని నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది.