ఒప్పో నుంచి రంగులు మార్చే ఫోన్.. ఈ ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు..!

Oppo తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో మొబైల్‌ Oppo Reno14 5G Diwali Editionను విడుదల చేసింది.

ఇది హీట్ సెన్సిటివ్, కలర్ ఛేంజ్ టెక్నాలజీతో భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 39,999గా ఉంది. స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్‌లో దీనిని కేవలం రూ. 36,999 కే కొనుక్కోవచ్చు.

వినియోగదారులు ఒప్పో ఈ-స్టోర్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిటైల్ స్టోర్ల నుండి కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

ఈ దీపావళి ఎడిషన్ డిజైన్‌ను భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించారు.

ఇది భారతీయ సంప్రదాయాలను సూచించే మండలాన్ని(ఆర్ట్) కలిగి ఉంటుంది. భారతదేశ జాతీయ పక్షి నెమలి, దైవిక రక్షణను కలిగి ఉంటుంది.

వీటి చుట్టూ అగ్నిలాంటి జ్వాల ఆకారాలు ఉన్నాయి. ఇవి దీపావళి సమయంలో ఇళ్లను వెలిగించే దియాలను (దియాలు) సూచిస్తున్నాయి.

వీటిలో 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15పై నడుస్తుంది.

ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అలాగే ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.