రచ్చ రచ్చే.. రూ.2వేలకే 5జీ స్మార్ట్ ఫోన్.. ఆఫర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో తన సరసమైన స్మార్ట్‌ఫోన్ Oppo K13x 5G ని విడుదల చేసింది.

ఈ ఫోన్‌పై ప్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్ అందుబాటులో ఉంది.

4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999గా ఉంది.

ఇప్పుడు కేవలం రూ.11,999లకే లిస్ట్ అయింది. అంటే రూ.4వేల తగ్గింపు లభిస్తుందన్నమాట.

అలాగే HDFC బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై మరో రూ.1500 తగ్గింపు పొందవచ్చు.

ఈ తగ్గింపు తర్వాత Oppo K13x 5G రూ.10,499కి అందుబాటులో ఉంటుంది.

దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.8,350 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తే మీరు Oppo K13x 5G ఫోన్‌ను కేవలం రూ.2,149లకే కొనుక్కోవచ్చు.

అయితే ఈ ఆఫర్ మొత్తం పొందాలంటే.. పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు.