OnePlus 15 భారతదేశంలో లాంచ్ అయింది.

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999 నుండి ప్రారంభమవుతుంది.

16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది.

HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగించి 12GB వేరియంట్‌ను కొంటే రూ.68,999 ధరకు లభిస్తుంది.

అదే సమయంలో 16GB వేరియంట్ రూ.75,999 కు అందుబాటులో ఉంటుంది.

పరిమిత కాల ఓపెన్ సేల్ ఆఫర్‌లో భాగంగా.. ముందుగా కొనుక్కుంటే OnePlus Nord Buds 3 ఉచితంగా లభిస్తుంది.

లైఫ్‌టైమ్ డిస్‌ప్లే వారంటీ, 180 రోజుల ఫోన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్, రూ.4,000 అప్‌గ్రేడ్ బోనస్ ఆఫర్లున్నాయి.

ఇది 6.78-అంగుళాల FHD+ (1,272x2,772 పిక్సెల్స్) 1.5K LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.

ఇది 165Hz రిఫ్రెష్ రేట్ల మధ్య ఛేంజ్ అవుతుంది. 1800 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 -ఆధారిత కలర్ OS 16పై నడుస్తుంది.

7,300mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.