చిలకడదుంపలోని విటమిన్-A క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది.

అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుంచి చిలకడ దుంప రక్షణ కల్పిస్తుంది.

శరీరానికి శక్తి, ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడటంలో ఈ దుంప తర్వాతే ఏదైనా.ఇందులోని విటమిన్-C జలుబు, ఫ్లూ రోగాలను తగ్గిస్తుంది.

దంతాలు ఆరోగ్యానికి, రక్త కణాల, కొలేజన్లు ఉత్పత్తి పెంచేందుకు తోడ్పడుతుంది.కొలేజన్లు చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి, క్యాన్సర్ వ్యాధిని దరిచేరకుండా అడ్డుకుంటాయి.

చిలగడ దుంపలోని ఫైబర్ జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్‌లు, అసిడిటీ, మలబద్దకాన్ని నివారిస్తాయి.

చిలకడ దుంప మానసిక ఆందోళనలు తగ్గించేందుకు తోడ్పడుతుంది. చిలగడ దుంపలో విటమిన్-D కూడా ఎక్కువే.

గుండె ఆరోగ్యానికి ఎముకలను బలపరచడానికి, క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను చిలగడదుంప కలిగి ఉంటుంది. 

ఎదిగే పిల్లలకు చిలగడ దుంపలను ఉడికించి తినిపించడంతో వారి మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది.