ఓటీటీల్లో రాంకామ్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కంటే కూడా క్రైమ్ థ్రిల్లర్ క్రేజ్ ఎక్కువ
ప్రస్తుతం అలాంటి క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది.
నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన రౌతు కా రాజ్ ఓటీటీలో రికార్డు వ్యూస్ తో సత్తా చాటుతోంది.
జూన్ 28 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ చిత్రం
విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ వాచ్ మినట్స్ సొంతం చేసుకున్నట్లు జీ5 ఓటీటీ తెలిపింది.
ఒక మహిళా హత్య చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది.
ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ పోలీస్ ఆఫీసర్ గా నటించారు.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆనంద్ సూరాపూర్ తెరకెక్కించారు.