మీ పొట్ట క్లీన్ అవ్వాలంటే ఈ చిట్కాలు పాటించండి..!!

By Bhoomi

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పటిష్టమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉండటం అవసరం.!

అపానవాయువు, గ్యాస్, ఆమ్లత్వం ఉంటే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని స్పష్టంగా అర్థం.

మీ పొట్ట కొవ్వు తగ్గాలంటే ఈ హోం రెమెడీస్ పాటించాలి. దీంతో మీ పొట్ట క్లీన్ అవుతుంది. 

మీ ఆహారంలో ప్రోబయోటిక్స్ తీసుకోండి. పెరుగు, మజ్జిగ తీసుకుంటే అందులోని బ్యాక్టీరియా మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

 యాపిల్ జ్యూస్ తాగడం వల్ల పేగులు క్లీన్ అవుతాయి.  రోజూ యాపిల్ జ్యూస్ తాగితే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవు.

జీర్ణక్రియ బాగా జరగాలంటే రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆరెంజ్, జామ, పియర్, మామిడి, యాపిల్ వంటి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినడం అలవాటు చేసుకోండి.