మోటరోలా ఈరోజు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో తన Motorola Edge 70ను విడుదల చేసింది.

ఇది రూ. 80,000 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్‌లో సుమారు రూ. 81,000 కు త్వరలో లాంచ్ అవుతుంది.

6.67-అంగుళాల pOLED సూపర్ HD డిస్‌ప్లేను 1220x2712 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB RAM + 512GB స్టోరేజ్‌తో వస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ కోసం Android 16పై నడుస్తుంది. 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,800mAh బ్యాటరీతో శక్తినిస్తుంది.

OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఎంపికలలో 5G, బ్లూటూత్, GPS, A-GPS, GLONASS, LTEPP, గెలీలియో, NFC, USB టైప్-C పోర్ట్, Wi-Fi 6E ఉన్నాయి.

భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ అందించారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఫోన్ IP68 + IP69 రేటింగ్‌ను కూడా పొందింది.