రూ.7,499లకే మోటో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు హైలైట్..!
Motorola తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G06 Powerను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Motorola తన కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G06 Powerను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు.
అక్టోబర్ 11 నుంచి దీని సేల్స్ Flipkart, Motorola అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతాయి.
ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ అందించారు.
6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇది 4G LTE ఫోన్. ఇందులో Wi-Fi, బ్లూటూత్ 6.0, GPS, గ్లోనాస్, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి.