నెలకు రూ. 4 వేల పెట్టుబడితో రూ. 40 లక్షలు పొందవచ్చు..

మీ పిల్లల చదువు కోసం ఇప్పటి నుంచే నెలకు రూ. 4 వేలు పెట్టుబడి పెట్టండి.

ఇలా పెట్టుబడి పెట్టడం వలన కొంత కాలానికి రూ. 40 లక్షలు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంట్లో కొడుకు/కూతురు ఉంటే.. వారి చదువుల కోసం ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేయండి.

మీ పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్(SIP)లో పెట్టుబడిని పెట్టవచ్చు.

20 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 4 వేలు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 12 శాతం రాబడి వచ్చే అవకాశం ఉంది.

12 శాతం రాబడి వస్తే 20 సంవత్సరాల తరువాత రూ. 40 లక్షలు లభిస్తుంది. ఈ డబ్బును మీ పిల్లల చదువు కోసం ఉపయోగించవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. వీటిలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.

మ్యూచ్‌వల్ ఫండ్స్‌తో పాటు.. కొన్ని బ్యాంకులు కూడా 7 నుంచి 8 వరకు వడ్డీని అందిస్తున్నాయి. అవసరమైతే అందులో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

Thick Brush Stroke

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం