విదేశాల్లో చదువుకునేవారికి స్కాలర్‌షిప్

విదేశాల్లో ఉన్నత చదువుకునే విద్యార్థులకు కేంద్రంలోని మోదీ సర్కార్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది.

నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కు ఫిబ్రవరి 15 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది.

మార్చి31 చివరి తేదీ. అమెరికా,యూకేలో మాస్టర్స్, పీహెచ్డీ కోసం ఫీజుతో పాటు రూ. 14 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. 

 విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు, వైద్య బీమా మొదలైనవి కూడా అందిస్తారు.

మొత్తం 125 మంది విద్యార్థులకు ఇచ్చిన ఈ స్కాలర్‌షిప్‌లో, 115 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు. 

సంచార, పాక్షిక సంచార తెగలు, భూమిలేని వ్యవసాయ కూలీలు,సాంప్రదాయ చేతివృత్తుల కుటుంబాల విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ అర్హులు.

విద్యార్థి తప్పనిసరిగా అమెరికాల, యూకే  సంస్థ నుండి మాస్టర్స్ లేదా పీహెచ్డీ ప్రవేశానికి ఆఫర్ లెటర్‌ను పొంది ఉండాలి.

విద్యార్థులు అర్హత పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

60శాతం మార్కులతో గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

అధికారిక పోర్టల్  nosmsje.gov.in/nosmsje ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.