రోజూవారి దినచర్యలో యోగ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఉదయాన్నే యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అయితే యోగ చేస్తున్న సమయంలో ఈ తప్పులను చేయడం వల్ల ప్రయోజనమేమి ఉండదు. 

యోగ చేస్తున్నపుడు బిగుతైన బట్టలను ధరించరాదు. దీని వల్ల కడుపులో కదలికలకు ఇబ్బంది ఏర్పడుతుంది.

యోగ చేస్తున్న సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇతర ఆలోచనలు వల్ల ఏకాగ్రతను కోల్పోతారు.

బ్రేక్ ఫాస్ట్ లేదా తిన్న తర్వాత యోగ చేయరాదు. ఇది ఆరోగ్యానికి హానికరం

యోగా సమయంలో శరీరంతో పాటు మీ మనస్సును కూడా  మీ ఆదీనంలో ఉంచుకోవాలి.

ఇష్టానుసారంగా యోగ చేయరాదు. నిపుణుల సలహాలతో సరైన పద్దతిలో చేయాలి.