పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీని దూరం చేస్తాయి.

శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా దరిచేరనివ్వదు. పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా మెదడులోని ఇతర భాగాలు చక్కని పనితీరు కనపరుస్తాయి. 

వంటల్లో తరచూ పుదీనాని చేర్చుకోవడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశింపజేయవచ్చు.

వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు.

పుదీనా ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి.

పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

చర్మం దురదలుగా ఉన్నప్పుడు ఈ పుదీనా ఆకులను నలిపి ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది.

నుదుట మీద పుదీనా ఆకుల రసం రాయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

పుదీనా శరీర బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పుదీనాలో ఉన్న నూనెలు జీర్ణాశయంలోని ఎంజైములను పెంచి జీర్ణక్రియను సక్రమంగా నిర్వహిస్తాయి