బాపు ఆరోగ్యమే మనకు స్పూర్తి..!!

 By Bhoomi

గాంధీ జీవితం మనందరికీ స్పూర్తి దాయకం. 

క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలన్నా, అహింస, సత్య మార్గంలో నడవాలన్నా బాపు నుంచి చాలా నేర్చుకోవచ్చు

గాంధీజీ ఆరోగ్యం, జీవనశైలి ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు.ఆయన డైట్‌ ఆయన్ను యాక్టివ్‌గా మార్చాయి.

గాంధీజీ ఫిట్‌నెస్ రహస్యం ఆయన నిద్ర, మేల్కొనే సమయాల్లోనే ఉంది. గాంధీజీ ఉదయం 4 గంటలకు నిద్రలేచేవారు. అలాగే రాత్రి 9 గంటలకు నిద్రపోయేవారు. 

 గాంధీజీ ఉదయం 7 గంటలకు అల్పాహారం తీసుకునేవారు, అందులో ఉల్లి, వెల్లుల్లి, నూనె లేకుండా సుగంధ ద్రవ్యాలతో చేసిన ఆహారాన్ని తినేవారు.

 తన ఆహారంలో ఉప్పు, చక్కెరను చాలా తక్కువ మొత్తంలో తీసుకునేవారట. ధాన్యాలు, పండ్లు,  కాలానుగుణ కూరగాయలు డైట్లో ఉండేవట. 

గాంధీజీ ఉపవాసం ఎక్కువగా ఉండేవారట. అందుకే ఆయన అంతలా ఆరోగ్యంగా ఉండేవారట. మైళ్ల దూరం నడిచేవారు.

 ప్రతిరోజూ అల్పాహారానికి ముందు బాపు దాదాపు 5 కి.మీ నడిచేవారు. 

బాపు రోజూ ఉదయం  8 నుంచి 10 గంటల మధ్య ఎండలో కూర్చుని శరీరానికి మసాజ్ చేయించేకునేవారట. 

 ఈ విషయాలన్నీ బాపు నుంచి  నేర్చుకుని ఆరోగ్యంగా ఉండండి.