మండే ఎండలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా, చురుగ్గా ఉంచుకోవాలంటే జ్యూస్ లు, షర్బత్ లు తీసుకోవాలి
వేసవిలో లిచీ ఫ్రూట్ జ్యూస్ సరైన ఎంపిక. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
1 కప్పు లిచీ, 1 టీస్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీస్పూన్ సాల్ట్, చక్కెర, 7-8 పుదీనా ఆకులు, 4 టీస్పూన్ల నిమ్మరసం, ఐస్ క్యూబ్స్.
మొదటగా లిచీ పండును తొక్క తీసి దాని గుజ్జును తీసి ఒక గిన్నెలో ఉంచండి.
ఇప్పుడు మిక్సర్‌లో లిచీ పల్ప్ వేసి బాగా బ్లెండ్ చేయాలి.
ఈ గుజ్జులో నిమ్మరసం, పుదీనా ఆకులు, తెలుపు, నలుపు ఉప్పు, పంచదార వేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచబడే వరకు బ్లెండ్ చేస్తూ ఉండండి.
ఆ పై లిచీ రసాన్ని స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ చేసి, కొద్దిగా చల్లబడే వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి..
తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవడమే.