స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా తన కొత్త 'Shark 2' ను లాంచ్ చేసింది.
దీని 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,500గా లాంచ్ అయింది.
ఫోన్ కొనుగోలుపై రూ.750 బ్యాంక్ తగ్గింపును అందిస్తున్నారు.
దీనిని రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
ఇది 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.
120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Unisoc T7250 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
Android 15లో నడుస్తుంది. 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.