ఆధునిక జీవనశైలికి అలవాటు పడుతున్న భారతీయులు అశ్రద్ధ చేస్తే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు
జన్యుకారణాలు, జీవనశైలి కారణంగా తలెత్తే గుండె జబ్బు, మధుమేహం వంటి జబ్బుల ముప్పు మిగతా వారికంటే..
భారతీయుల్లో పదేండ్ల ముందే మొదలవుతున్నాయని తాజాగా అధ్యయనంలో వెల్లడి.
దీనికి ప్రధాన కారణం భారతీయులలో శారీరక శ్రమ తగ్గడమేనట.
WHO మార్గదర్శకాల ప్రకారం శారీరక శ్రమలేని వారిలో.. భారత్ మహిళలు 57 శాతం ఉండగా, పురుషులు 42 శాతం ఉన్నారు.
శారీరక శ్రమకు లేకుండా, జబ్బులకు దగ్గరవుతున్న భారతీయుల సంఖ్య, ప్రతి సంవత్సరం పెరుగుతోంది.
WHO మార్గదర్శకాలు మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎంత శారీరక శ్రమ అవసరమో ఇప్పుడు తెలుసుకుందాము
పెద్ద వారు వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం, నడక, జాగింగ్, ఈత కొట్టడం వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లను చేయాలి.
వారానికి 150 నిమిషాల కంటే తక్కువ శారీరక శ్రమ కలిగిన వారు శారీరకంగా చురుకుగా లేనట్లు
195 దేశాల్లో.. తగినంత శారీరక శ్రమ లేని దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో ఉంది.