టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అద్భుత విజయం సాధించింది.

మరో వైపు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ టీ20 ఫార్మేట్ కు వీడ్కోలు పలికారు. 

ఈ ఇద్దరినీ భారత టీ20 చరిత్రలో.. టీమిండియా టీ20 ప్రయాణంలో అత్యంత ప్రధానమైన ఇంధనంగా చెప్పవచ్చు. 

ఈ ఇద్దరి స్టార్ క్రికెటర్ల టీ 20 ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

రోహిత్ శర్మ టీమ్ ఇండియా తరఫున మొత్తం 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 

151 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో 3003 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 4231 పరుగులు చేశాడు.

వీటిలో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

రోహిత్  మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో ఆడాడు. అప్పుడు టీమిండియా కప్ గెలిచింది.

ఇప్పుడు తన చివరి టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు.

ఇక విరాట్.. టీమిండియా తరుపున 125 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 117 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఇందులో మొత్తం  3056 బంతులు ఎదుర్కొని 4188 పరుగులు సాధించాడు.

మొత్తంగా 38 అర్ధసెంచరీలు, 1 భారీ సెంచరీ సాధించాడు.

కోహ్లీ తన టీ20 కెరీర్ 2010లో ప్రారంభించాడు.