టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ మరో కొత్త ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
తాజాగా తన తొలి హిందీ ‘బేబీ జాన్’ విడుదల తేదీని అనౌన్స్ చేసింది
ఎ.కాళీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేసింది.
ఇప్పటికే సినిమా గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ విజయ్ ‘తేరీ’ (2016) సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్’ రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇది కీర్తి సురేష్ తొలి హిందీ చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు