కానుగ చెట్టు పువ్వును రక్తస్రావం హెమోరాయిడ్స్, పైల్స్ చికిత్సకు ఉపయోగిస్తారు.

పొత్తికడుపులో కణితులు, స్త్రీ జననేంద్రియ అంటువ్యాధులు, అల్సర్లకు కానుగ చెట్టు పండుతో చికిత్స చేస్తారు.

మచ్చ కణజాల కణితులు, అధిక రక్తపోటు, రక్తహీనత చికిత్సలకు కానుగచెట్టు విత్తనం సారాన్ని ఉపయోగిస్తారు.

బ్రోంకటైస్, కోరింత దగ్గు, జ్వరం చికిత్సలో కానుగ చెట్టు ఆకుల పొడి సహాయపడుతుంది. 

రక్తస్రావ నివారిణిగా, పరాన్నజీవి పురుగులను చంపడానికి కానుగ నూనెను ఉపయోగిస్తారు.

కోరింత దగ్గు, పైల్స్, కాలేయ నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, అల్సర్లు చికిత్స చేయడంలో ఈ నూనె సహాయపడుతుంది.

కేంద్ర నాడీ వ్యవస్థను మృదువుగా చేయడానికి కానుగ చెట్టు కాండాన్ని ఉపయోగిస్తారు.

కానుగ గింజలను మెత్తగా నూరి తేనెతోనూ, నెయ్యితోనూ, పంచదారతోనూ కలిపి తీసుకుంటే శరీరాంతర్గత రక్తస్రావం ఆగిపోతుంది.

బాహ్యాభ్యంతర రక్తస్రావం తగ్గేందుకు కానుగ గింజలను మెత్తగా నూరి వేడిచేసిన ఉప్పును కలిపి పెరుగుమీద తేటతో మూడురోజులపాటు తీసుకుంటే ఆ రక్తస్రావం నిలిచిపోతుంది.

లేత కానుగ ఆకులను తెచ్చి ముద్దగా నూరి నువ్వుల నూనె, ఆవు నెయ్యిల మిశ్రమంలో వేయించి, వేయించిన గోధుమ పిండిని కలిపి తీసుకుంటే అరుగుదల పెరిగి, సుఖ విరేచనమై అర్శమొలలు తగ్గుతాయి.