టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇప్పటికి 50 కోట్ల వినియోగదారుల మార్కును దాటినట్లు ప్రకటించింది.

ఈ వేడుక సందర్భంగా కస్టమర్ల కోసం అదిరిపోయే ప్రత్యేక ఆఫర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రూ.349లతో రీఛార్జ్ చేసుకన్న కస్టమర్లకు నేటి నుండి అక్టోబర్ 5 వరకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది.

రూ.349 కంటే ఎక్కువ ధరతో రీఛార్జ్ చేసుకున్న 5G ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.

అలాగే అన్ని 5G వినియోగదారులకు సెప్టెంబర్ 5 నుండి 7 వరకు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటాను అందిస్తుంది.

సెలబ్రేషన్ ప్లాన్‌లో వరుసగా 12 రీఛార్జ్‌లను పూర్తి చేసిన కస్టమర్‌లకు 13వ నెల ఉచితంగా లభిస్తుందని కంపెనీ తెలిపింది.

హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ కూడా ఒకటుంది. ఇందులో మీరు రూ.1,200కి రెండు నెలల జియోహోమ్ కనెక్షన్‌ను పొందుతారు.

ఈ కనెక్షన్‌లో 1,000 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్, అపరిమిత డేటా, 12 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ లభిస్తుంది.