ఆపిల్ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయనుంది.

ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 మాక్స్ ఉంటాయి.

ఐఫోన్ 17 ప్రోను సెప్టెంబర్ 11 నుంచి 13 మధ్య లాంచ్ చేసే అవకాశం ఉంది

ఐఫోన్ 17 ప్రో మోడల్‌ రూ.1,39,999 ప్రారంభ ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రో ఫోన్ బ్లాక్, వైట్, గ్రే, గోల్డ్ వంటి కలర్‌లతో వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త సిరీస్ గతం కంటే డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్‌లు, పనితీరు, ఆపిల్ ఇంటెలిజెన్స్ పరిధిని విస్తరిస్తుంది.

ఈ మోడల్స్ సెప్టెంబర్‌లో లాంచ్ అయిన తర్వాత ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

ఆ తర్వాత కొన్ని వారాల్లో యుఎస్, భారతదేశంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.