ఐఫోన్ 17 సిరీస్‌లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. ఇవి తెలుసుకోండి..!

iphone 17 series తాజాగా విడుదలైంది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

అందులో iphone 17, iphone 17 pro, iphone 17 pro max, iphone 17 air ఉన్నాయి.

ఐఫోన్ 16 సిరీస్ కంటే ఐఫోన్ 17 సిరీస్ పెద్ద అప్‌గ్రేడ్‌‌లతో వచ్చింది.

iphone 17 ఎయిర్.. కేవలం 5.6 మి.మీ. మందంతో ఆపిల్ చరిత్రలోనే అత్యంత సన్నని ఫోన్‌గా నిలిచింది.

ఐఫోన్ 17 సిరీస్‌లోని.. అన్ని మోడల్స్ 120Hz ప్రోమోషన్ OLED డిస్‌ప్లేతో వచ్చాయి.

ఐఫోన్ 17 డిస్‌ప్లేపై ఉండే గీతలను నివారించడానికి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ అందించారు.

ఐఫోన్ 17 సిరీస్ A19, A19 ప్రో చిప్‌సెట్‌లను కలిగి ఉన్నాయి. ఇది మెరుగైన స్పీడ్, సమర్థత, AI సామర్థ్యాలను అందిస్తుంది.

ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌లో 12GB ర్యామ్ అందించారు. ఇది ఐఫోన్ 16 సిరీస్ కంటే చాలా ఎక్కువ.

ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడల్స్‌ 24MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి.

ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్‌లో వెనుక వైపు మూడు 48MP ఫ్యూజన్ కెమెరాలు ఉన్నాయి.