రాత్రి నిద్రపట్టకపోవడానికి అసలైన రీజన్ ఇదే..!

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు. రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడంతో అల్లాడిపోతున్నారు.

అయితే ఇలా నిద్ర పట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

నిద్రపోయే ముందు భారీగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుందని చెబుతున్నారు.

అలాగే రాత్రి పూట ఏమీ తినకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆకలి వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రపోయేందుకు రెండు గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.

రాత్రిపూట టీ, కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. వీటిలో ఉండే కెఫిన్ వల్ల మెదడు చురుగ్గా మారి, నిద్ర రాకుండా చేస్తుంది.

స్మార్ట్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి వాటి స్క్రీన్ల నుండి వచ్చే బ్లూలైట్ కళ్లపై పడి.. నిద్ర రానియ్యకుండా చేస్తుంది. ముఖ్యంగా వీటికి దూరంగా ఉండాలి.

అందుకే నిద్రపోయే ముందు కనీసం ఒక గంట ముందు స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. బదులుగా పుస్తకాలు చదవడం లేదా మెడిటేషన్ చేయడం మంచిది.

రోజువారీ పనుల గురించి లేదా సమస్యల గురించి ఆలోచిస్తూ పడుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల నిద్ర పట్టదు.

కాబట్టి పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం వల్ల శరీరానికి ఒక క్రమమైన అలవాటు ఏర్పడుతుంది. ఈ అలవాటును పాటించకపోతే, నిద్రకు ఆటంకం కలుగుతుంది.

మంచి నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. అందువల్ల ఈ తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు.