ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix Note 50s 5G+ మొబైల్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది.

8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది.

అలాగే 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా అందుబాటులో ఉంచింది.

ఫస్ట్ సేల్ ఏప్రిల్ 24 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.

ఇది 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3D కర్వ్డ్ AMOLED ప్యానెల్‌తో వస్తుంది.

8 GB RAM, 8 GB వర్చువల్ RAM కు మద్దతు ఉంది. మొత్తంగా ఇది 16GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది.

ఇది సువాసన వెదజల్లే ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫీచర్ మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ వేరియంట్‌లో వస్తుంది.

ఇందులో 64MP ప్రధాన కెమెరా, సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరాను అందించారు.