మనం ఏం చేయాలన్నా.. బ్రెయిన్ యాక్టివ్ గా.. హెల్దీగా ఉండాల్సిందే..

ఆహారానికి, మన మెదడుకు మధ్య అనుసంధాన వ్యవస్థ ఉంటుంది.

దీంతో కొన్ని రకాల ఆహారాలు మన మెదడును చురుకుగా పెట్టడానికి దోహదం చేస్తాయని అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ కాలేజ్ న్యూట్రిషనల్ సైకియాట్రిస్టులు పేర్కొన్నారు

ఆరోగ్యకరమైన ఆహారంతో సెరోటోనిన్ హార్మోన్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతుంది.

ఆహారం ఆరోగ్యకరంగా లేకపోతే..డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

అందుకే బ్రెయిన్ షార్ప్ గా ఉంచుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెట్టుకోవాలి

విటమిన్ బి, బి12,బి9,బి1లు బ్రెయిన్ చురుకుగా ఉంచడంలో దోహద పడతాయి.

ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయల్లో ఈ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పసుపు, కుంకుమ పువ్వు తీసుకోవడం ద్వారా కూడా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.