వినాయక చవితి రోజు గణేష్ చాలీసా చదివితే కష్టాలన్నీ దూరం..!!
By Bhoomi
గణేశ్ చతుర్థి భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థిరోజు జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న ఈ పండగను జరుపుకోనున్నారు. ఈ రోజు వినాయకుడిని పూజిస్తారు.
కొంతమంది ఈరోజు ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం వారి జీవితంలో కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసి పూజగదిని శుభ్రం చేయండి.
ఈరోజు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. ఇలా చేస్తే అంతామంచి జరుగుతుందని నమ్మకం.
వినాకుడికి పూజలు చేసి మోదకం సమర్పించాలి.
గణేశుడి అనుగ్రహం కోసం గణేష్ చాలీసాను చదవండి. ఇలా చేస్తే వినాయకుడు సంతోషిస్తాడు.
విగ్రహం ప్రతిష్టించిన తర్వాత ఉదయం, సాయంత్రం పూజలు చేసి హారతి ఇవ్వండి.
పశ్చిమదిశలో దీపం పెట్టడం శుభప్రదం. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.