శరీరానికి నీళ్లు చాలా అవసరం. నీళ్ళు లేకపోతే బాడీ మొత్తం డీ హైడ్రేడే అయిపోతుంది

అలా అని అతిగా వాటర్ తాగితే కూడా చాలా ప్రమాదమే. శరీరం ఓవర్ హైడ్రేడ్ అయిపోతుంది

దీంతో రక్తప్రసరణలో అవసరమైన ఎలక్ట్రోలైట్లు పలుచన అవుతాయి

ఈ ప్రభావంతో శరీరంలో ప్రతికూలతలు వస్తాయి. వికారం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు, మూర్ఛలు వస్తాయి.

అంతే కాదు..తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

అయితే తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడంతో తలెత్తే సమస్యలు ఇవి. వీటితో ప్రాణాలు కూడా పోయే ప్రమాదముంది.

అయితే బాడీ డీహైడ్రేడ్ కాకుండా తగినంత నీటిని మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి

లేకపోతే.. గొంతుపొడారిపోవడం,దాహం, కిడ్నీలు దెబ్బతినడం జరుగుతుంది.