ఈ లక్షణాలు ఉంటే కాల్షియం లోపించినట్లే

శరీరంలో కాల్షియం లోపిస్తే కొన్ని లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. 

కండరాలు పట్టేస్తుంటే కాల్షియం లోపించిట్లు అర్థం. తిమ్మిరి, పాదాలలో మెలితిప్పినట్లుగా అనిపిస్తుంది. 

కాల్షియం లోపిస్తే గోళ్లు బలహీనంగా మారుతాయి. తెల్లటి మచ్చలు లేదా చీలికలు వచ్చినట్లు కనిపిస్తాయి. 

కాల్షియం లోపిస్తే కావిటీస్, దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. 

కాల్షియం లోపం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఎముకలు పగుళ్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. . 

ముఖంలో తిమ్మిరి, జలదరింపు, సూదులు గుచ్చినట్లు అనిపిస్తే కాల్షియం లోపమే అని అర్థం. 

కండరాల పనితీరు కాల్షియం ప్రధానపాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపిస్తే అలసట, బలహీనతకు దారితీస్తుంది.