టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్‌లో తెలివైన బౌలింగ్‌తో టీమిండియా గెలుపుకు ప్రధాన కారణమయ్యాడు బుమ్రా.

సౌతాఫ్రికా గెలవాలంటే 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది.

ఇక డెత్‌ ఓవర్లలో అదిరే బౌలింగ్‌తో సౌతాఫ్రికాను నిలువరించాడు బుమ్రా

నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు

డెత్‌ ఓవర్లలో బుమ్రా వేసిన రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే వచ్చాయి.

కీలకమైన సమయంలో మార్కో జెన్సన్‌ వికెట్‌ తీసేశాడు.ఇదే టీమిండియా గెలుపుకు ప్రధాన కారణమైంది.

కేవలం ఈ ఒక్క మ్యాచ్‌లోనే బుమ్రా ఇలా వేయలేదు. ఈ టోర్ని మొత్తం బుమ్రా హవా కొనసాగింది

టోర్ని మొత్తం అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.

బ్యాటింగ్‌ పిచ్‌లపైనా సత్తా చాటుతుండడం బుమ్రా స్పెషాలిటీ.

బుమ్రా  అద్భుత బౌలింగ్‌ తెలివికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం సెల్యూట్ చేస్తోంది.

బౌలింగ్‌ దిగ్గజాలు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీం అక్రమ్‌ లాంటి వారికి ఏ మాత్రం తీసిపోడని ఇప్పటికే నిరూపించుకున్నారు బుమ్రా