ఆరోగ్యమైన జుట్టు కోసం రెగ్యులర్ గా జుట్టుకు నూనె అప్లై చేయాలి

జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

జుట్టు రాలే సమస్యను దూరం చేయడానికి వారానికి ఎన్ని సార్లు నూనె అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము

పొడి స్కాల్ప్ ఉన్నవారు వారానికి 2 నుంచి 3 సార్లు నూనె రాసుకోవచ్చు.

జిడ్డు జుట్టుగల వారు వారానికి ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది.

సాధారణ జుట్టు కలిగిన వారు వారానికి 1 నుంచి 2 సార్లు నూనె రాసుకోవచ్చు.

 విపరీతమైన వేడి, చలి, తేమ వంటి వాతావరణంలో నివసించేవారు వారానికి 2 నుంచి 3 సార్లు నూనె రాయాలి.

బలహీనమైన జుట్టు, జుట్టు రాలే సమస్య ఉన్నవారు తప్పనిసరిగా వారానికి 2-3 టైమ్స్ అప్లై చేయాలి.

ఇది జుట్టు కుదుళ్ళు బలపడడానికి సహాయపడుతుంది