ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు.

ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు.

తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది

ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి.

అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది.

ఉలవలు ఆకలిని పెంచుతాయి.ఉలవల్లో ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్రణలో ఉంటాయి.

మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది.

కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.

నెలసరి రెగ్యులర్ గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు.