హోండా యాక్టివాకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది.
అదే కంపెనీ నుండి వచ్చిన మరో స్కూటర్ Honda Dio 110 పై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
Honda Dio 110 స్టాండర్డ్ వేరియంట్ రూ.69,096 ధరతో ప్రారంభం అవుతుంది.
DLX వేరియంట్ ధర రూ.79,973 ఎక్స్-షోరూమ్ నుండి మొదలవుతుంది.
109.51cc, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
ఈ ఇంజిన్ eSP (ఎన్‌హాన్స్డ్ స్మార్ట్ పవర్) టెక్నాలజీని కూడా కలిగి ఉంది.
ఇది 7.65 bhp, 9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గరిష్ట వేగం గంటకు 83 కి.మీగా ఉంది.
ఈ స్కూటీ 48-55 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
స్పోర్టీ డిజైన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, గ్రాఫిక్స్ ఫీచర్లను కలిగి ఉంది.
LED హెడ్‌ల్యాంప్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS), ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, ట్యూబ్‌లెస్ టైర్లుతో వస్తుంది.