రూ.1899లకే మైండ్‌ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇక రచ్చ రచ్చే..!

HMD కంపెనీ తన కొత్త స్మార్ట్‌‌ఫోన్‌ HMD Vibe 5Gను భారత మార్కెట్లో విడుదల చేసింది.

కంపెనీ దీనిని కేవలం రూ.8,999 ధరకే లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల HD+ HID LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం కంపెనీ 8MP కెమెరాను అందించింది. 18W ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని అందించింది.

దీనికి Unisoc T760 ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్‌లో 4GB RAM + 128GB స్టోరేజ్ ఉన్నాయి.

తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకునే వారికి ఇది బెటర్.

దీనితో పాటు కంపెనీ రెండు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది అందులో ఒకటి- HMD 101 4G కాగా మరొకటి HMD 102 4G ఉన్నాయి.

ఈ ఫోన్లు రెండూ 2-అంగుళాల QQVGA డిస్ప్లేను కలిగి ఉన్నాయి.

దీనికి 1000mAh బ్యాటరీ అందించారు. ఈ హ్యాండ్‌సెట్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది.

HMD 101 4G ఫోన్‌ రూ.1899, HMD 102 4G ఫీచర్ ఫోన్ ధర రూ.2199గా కంపెనీ నిర్ణయించింది.