తమలపాకులు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పాన్ ఆకుల పేస్ట్‌ను గాయాలపై రాస్తే వెంటనే పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 

దీనిని నమలడం వల్ల మీ జీర్ణక్రియతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయి. 

ఆకులు నమలడం వల్ల మీ నోటి దుర్వాసన దూరమవుతుంది. అంతేకాకుండా కావిటీస్, దంతక్షయాన్ని అరికట్టి నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గడంలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మీ శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.

యాంటీఆక్సిడెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ప్రొలిఫెరేటివ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి.

రోజూ తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

తమలపాకులు నమలడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. అంతేకకాుడండా మీరు డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.

ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. మీరు డయాబెటిస్‌ ఉంటే.. తమలపాకు తీసుకుంటే మంచిది.