హెల్త్ ఇన్సూరెన్స్ ఏ వయసులో తీసుకోవాలి

అనారోగ్యం చెప్పి రాదు. వచ్చిన తరువాత అది తీవ్రమైతే ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది

అందుకే హెల్త్ న్సూరెన్స్ పాలసీ తీసుకోవడం.. అదీ చిన్న వయసులోనే తీసుకోవడం మంచిది

చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి

చిన్నవయసులో వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ కాబట్టి.. తక్కువ ఖర్చుతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దొరుకుతుంది.

పెద్ద వయసు వచ్చాకా అంటే 45 ఏళ్ళు దాటితే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి ఇన్సూరెన్స్ సంస్థలు

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరగదు కాబట్టి, నో క్లెయిమ్ బోనస్ ఇస్తాయి కంపెనీలు

తక్కువ వయసు ఉన్నపుడే. అంటే ఉద్యోగం వచ్చిన వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఆరోగ్య ఇబ్బందులు వచ్చినపుడు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు

ఫైనాన్షియల్ టార్గెట్స్ రీచ్ అవడానికి ఒక్కోసారి అనారోగ్యం కారణం అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ చిన్నతనంలోనే తీసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు

సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు వెంటనే కవరేజ్ మొదలు కాదు. కొన్ని వ్యాధులకు 2-4 ఏళ్ల లాకింగ్ పిరియడ్ ఉంటుంది

తక్కువ వయసులోనే ఇన్సూరెన్స్ చేయడం వలన వెయిటింగ్ పిరియడ్ లేకుండా పాలసీ పొందవచ్చు