పొన్న‌గంటి కూర‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, రైబో ఫ్లేవిన్, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్, జింక్ ల‌తోపాటు ప్రోటీన్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి.

పొన్న‌గంటి కూర‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, రైబో ఫ్లేవిన్, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్, జింక్ ల‌తోపాటు ప్రోటీన్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి. 

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ ఆకు కూర‌ను త‌ర‌చూ తింటే చాలా మంచిది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది.

దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.

పొన్నగంటి కూర జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు.

ఆయుర్వేద ఔషధంలో ఒంట్లోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ ఈ ఆకుకూరను తీసుకోవటం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.

రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ కూరను తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. కళ్లను సంరక్షించుకోవచ్చు. 

పొన్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది.