పుచ్చ కాయ మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం ఇస్తుంది.

శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పుచ్చకాయ సాయపడుతుంది.

ఇందులో 92 శాతం నీరే ఉంటుంది. పైగా పుచ్చకాయలో క్యాలరీలు తక్కువ.

బరువు కూడా పెరగరు.

పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి

గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడానికి వాటర్‌మెలన్‌లోని లైకోపీన్ సహాయపడుతుంది

పుచ్చకాయలో ఉంటే సిట్రులైన్ అమైనో యాసిడ్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.